Sunday, January 19, 2025

డబ్బులు ఇవ్వలేదని.. కానిస్టేబుల్ అల్లుడు ఎంత పని చేశాడో చూడండి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హన్మకొండలోని గుండ్ల సింగారం గురువారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ పోలీసు కానిస్టేబుల్ తన అత్తను కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కానిస్టేబుల్ ఎ. ప్రసాద్ తన అత్తగారితో తీవ్ర వాగ్వాదం సందర్భంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో కమలమ్మ(53) అక్కడికక్కడే మృతి చెందింది.

మహిళ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ప్రసాద్‌ను పట్టుకుని చితక బాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. గుండ్ల సింగారంలో నివాసముంటున్న రమాదేవిని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే వైవాహిక వివాదాల కారణంగా కానిస్టేబుల్ భార్య గత మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

గురువారం ప్రసాద్ అత్తమామల ఇంటికి వెళ్లాడు. అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహంతో రివాల్పర్ తీసి ఆమెపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News