Thursday, November 21, 2024

బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన…. పోలీస్ శాఖ సీరియస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్స్ చేస్తున్న ఆందోళనపై పోలీస్ శాఖ ఆగ్రహంగా ఉంది. ది పోలీస్ ఫోర్సెస్ రిస్టిక్సన్ ఆఫ్ రైట్ యాక్ట్, ది పోలీస్ ఇనిక్ మెంట్ టు డిసఫెక్షన్ యాక్ట్ ప్రకారం పోలీసులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడమనేది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని పోలీస్ శాఖ భావిస్తోంది. బెటాలియన్ కానిస్టేబుల్స్ చేస్తున్న ఆందోళనను సహించకూడదని నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ లో పని చేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపైకి వచ్చిన వారిపై చట్టపరమైన, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

సెలవుల విషయంలో ఇప్పటికే పాత పద్ధతిని అనుసరిస్తామని చెబుతున్నప్పటికి ఇంకా కావాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తీవ్ర చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమవుతుంది. ఇప్పటికే కొంతమందిని పోలీస్ శాఖ గుర్తించడంతో పాటు కానిస్టేబుల్ ఆందోళన వెనకాల కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని పోలీస్ డిపార్ట్ మెంట్ అనుమానిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News