Monday, January 20, 2025

వృద్ధురాలి బట్టలూడదీసి తనిఖీలు…

- Advertisement -
- Advertisement -

constable suspended for strip-searching elderly

ఎయిర్‌పోర్టులో అమానుషం

గువహతి/న్యూఢిల్లీ : భద్రతా తనిఖీల ప్రక్రియ పరిధిలో ఓ మహిళా కానిస్టేబుల్ ఓ 80 ఏండ్ల అనారోగ్యపు ముదుసలిని దారుణంగా అవమానించింది. వీల్ ఛైర్‌లో వచ్చిన ఈ ముదుసలిని ఓ మహిళా కానిస్టేబుల్ దుస్తులు విప్పించి తనిఖీలకు దిగింది. తనకు తుంటి ఆపరేషన్ అయిందని, కనికరం చూపాలని వేడుకున్నా ఈ కానిస్టేబుల్ వినలేదు. డ్యూటీ అంటే డ్యూటీని మొండిగా వ్యవహరించింది. ఈ ఘటన గురువారం అసోంలోని గువహతి విమానాశ్రయంలో జరిగింది. విమాన ప్రయాణానికి ఈ వృద్ధురాలు తన మనవరాలితో లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చింది. ఇక్కడి ఎయిర్‌పోర్టుతో పాటు దేశంలోని 64 ఇతర విమానాశ్రయాల భద్రతా పర్యవేక్షణ బాధ్యతలను పారామిలిటరీ బలగాలు చూసుకుంటున్నాయి.

ఈ బలగాల బృందంలో విధులు నిర్వర్తిస్తోన్న మహిళా కానిస్టేబుల్ ప్రయాణికురాలి పట్ల దురుసుగా వ్యవహరించిన విషయం తరువాతి ఫిర్యాదులతో నిర్థారణఅయింది. దీనితో స్పందించి విమానాశ్రయాల భద్రతా విభాగం సిఐఎస్‌ఎఫ్ వెంటనే ఈ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. విమానాశ్రయాలలో భద్రత కీలకమే అయితే ప్రయాణికుల గౌరవ మర్యాదలు, వారి శారీరక మానసిక స్థితిని కూడా తనిఖీ సిబ్బంది దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంది. ఇప్పుడు ఈ వృద్ధురాలి పట్ల జరిగిన ఘటన దురదృష్టకరం.దీనిపై సిఐఎస్‌ఎఫ్ దర్యాప్తు చేపట్టింది. మహిళ పట్ల జులుంతో వ్యవహరించిన సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News