Monday, December 23, 2024

సస్పెన్షన్ ఎత్తివేయాలి

- Advertisement -
- Advertisement -

39మంది స్పెషల్ పోలీసులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి సస్పెన్షన్లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా
వివిధ బెటాలియన్లలో నిరసన నల్లగొండ, సిరిసిల్లలో కానిస్టేబుళ్ల కొవ్వొత్తుల ర్యాలీ

మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల: తమ సహోద్యోగులలో 39 మందిని సస్పెండ్ చే యడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ బెటాలియన్లలో కానిస్టేబుళ్లు ఆదివారం నిరసనకు దిగా రు. వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాల ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో 12వ బె టాలియన్‌కు చెందిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టిజిఎస్‌పి) కానిస్టేబుళ్లు నిరసన తెలిపారు. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరించడం లేదని భావించిన పోలీస్ యంత్రాంగంలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ నిరసన హైలైట్ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్‌కు చెందిన తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆదివారం రాత్రి జి ల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ, 4వ, 5వ, 6వ, 12వ, 13 వ, 17వ పోలీస్ బెటాలియన్లలోని 39 మందిపై శనివారం విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని వా రు డిమాండ్ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో ఆరుగురు సిరిసిల్లలో ని 17వ బెటాలియన్ స్పెషల్ పోలీసులున్నారు. ఈ సందర్భంగా బెటాలియన్ పోలీస్ ప్రతినిధులు మాట్లాడుతూ డాలని, కర్నాటక, తమిళనాడు పోలీసుల మాదిరిగా తమకు నిబంధనలు అమలు చేయాలని కో రారు. రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్షన్‌కు గురైన 39 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News