- Advertisement -
మంగళగిరిలో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మంగళగిరిలోని గిద్దలూరు సమీపంలో చోటుచేసుకుంది. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ ఫరూక్.. గిద్దలూరు సమీపంలోని ఘాట్‌లో అనుమానాస్పద మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెబ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓ యువతితో ఫరూక్ కు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఫరూక్ మృతి ప్రేమ వ్యవహారమా? లేకా ఇంకేమైన ఉందా అనే కోెణంలో విచారణ చేస్తున్నారు.
- Advertisement -