మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాతపరీక్షలు కొనసాగుతున్నాయి. సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్.. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 2న నిర్వహించనున్న ఫైనల్ పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి మార్చి 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఫోన్ నెంబర, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షను ఏప్రిల్ 2న హైదరాబాద్ కేంద్రంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 31న అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. మండలి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఛైర్మన్ వి.వి.శ్రీనివాస రావు వెల్లడించారు. డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
హాల్ టికెట్‌పై తప్పనిసరిగా ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు. ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(ఐటి అండ్ సిఒ) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.