హైదరాబాద్: భాగ్యనగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతోంది. కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను మరొకరికి ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. వీరబాబు గుండెను నిమ్స్‌లో ఓ పెయింటర్‌కు వైద్యులు అమర్చనున్నారు. నిమ్స్‌లో ఇది 6వ గుండె మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. నిమ్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ కొనసాగుతోంది. గుండెను మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి నిమ్స్‌కు తరలిస్తున్నారు. మలక్‌పేట నుంచి నిమ్స్ వరకు పోలీస్ అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను నిమ్స్ కు వైద్యులు తరలించారు. హైదరాబాద్ పోలీసులు అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేశారు. బయట నుంచి గుండెను తీసుకరావడం నిమ్స్‌లో ఇదే తొలిసారి. తెలంగాణ ప్రభుత్వం అవయవ మార్పిడి ఆపరేషన్లు ఆరోగ్య శ్రీలో చేయిస్తోందని జీవన్‌దాన్ డైరెక్టర్ స్వర్ణలత తెలిపారు. ఈ నెల 12న ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వీరబాబు గాయపడ్డాడు. మంగళవారం వీరబాబును వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు.
కానిస్టేబుల్ బ్రెయిన్ డెడ్… నిమ్స్ లో గుండె మార్పిడి
- Advertisement -
- Advertisement -
- Advertisement -