Monday, January 20, 2025

మాతృత్వం చాటుకున్న మహిళా పోలీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీసుల్లో కాఠిన్యమే కాదు ప్రేమను కూడా పంచగలరని మరోసారి నిరూపితమైంది. విధినిర్వహణలో పోలీసులు సాధారణంగా కఠినంగా ఉంటారు. నేరాలను అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరి, కాని మరోవైపు అవసరం అనుకుంటే ప్రేమను కూడా పంచగలరని శనివారం నిరూపితమైంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై రాత పరీక్ష నిర్వహించగా గండిపేటలోని ఎంజేఐటి కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అభిల అనే అభ్యర్థి తన రెండు నెలల పాపతో ఎస్సై పరీక్ష రాసేందుకు కేంద్రానికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్ కన్యాకుమారి పాపను తీసుకుంది. పాప తల్లి పరీక్ష రాసే వరకు పాపను లాలించింది. ఇది చూసిన పలువురు కానిస్టేబుల్ కన్యాకుమారిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News