Wednesday, January 22, 2025

భవిషత్తులో మరిన్ని విజయాలు సాధించాలి

- Advertisement -
- Advertisement -

Constable who won gold medal in beach volleyball

బీచ్ వాలీబాల్‌లో బంగారు పతకం సాధించిన కానిస్టేబుల్
అభినందించిన సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్ : బీచ్ వాలీబాల్‌లో బంగారు పతకం సాధించిన కానిస్టేబుల్ మహేష్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అంబటి మహేష్ గుజరాత్ రాష్ట్రం, సూరత్‌లో నిర్వహించిన బీచ్ వాలీబాల్ 36వ నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ తరఫున ఆడి బంగారు పతకం గెల్చుకున్నాడు. పతకం సాధించిన మహేష్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. కానిస్టేబుల్ మహేష్‌కు సిపి క్యాష్ రివార్డును అందించారు. కార్యక్రమంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, సిఎఆర్ హెడ్ ఎడిసిపి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News