Thursday, December 19, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు కనిస్టేబుళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుతో మరికొందరు పోలీసులకు కూడా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరి ట్యాపింగ్ ను అప్పట్లో ఒక మాజీ ఎమ్మెల్యే పర్యవేక్షించినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కానిస్టేబుళ్లిద్దరూ నల్గొండలో ఒక సర్వర్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఇదిలాఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు సహకరించిన హోంగార్డు, ఎలక్ట్రీషియన్ ల నుంచి అధికారులు విడివిడిగా వాంగ్మూలాలను రికార్డు చేశారు. మరోవైపు ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న రాధాకిషన్ రావును పోలీసులు శుక్రవారం కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఆయన విచారణకు అంతగా సహకరించట్లేదని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News