Wednesday, January 22, 2025

కానిస్టేబుల్ పరీక్ష ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

Constable's written exam ends peacefully

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,601 కేంద్రాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి చైర్మన్ వి.వి శ్రీనివాసరావు తెలిపారు. జరిగింది. ఈక్రమంలో 16,321 కానిస్టేబుల్ పోస్టుల కోసం 6,61,198 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 6,03,955 మంది(91.34శాతం) పరీక్షకు హాజరయ్యారని ఆయన వివరించారు.మొత్తం 1,601 పరీక్షా కేంద్రాల్లో రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని, నిమిషం ఆలస్యం నిబంధనలు అమలులో ఉండటంతో పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేదని తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫొటోలను పోలీసు అధికారులు సేకరించారని, దేహధారుడ్య పరీక్షలు, తుది పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగానే అనుమతిస్తామని టిఎస్‌ఎల్‌పిఆర్‌బి చైర్మన్ వి.వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అదేవిధంగా కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష కీ పేపరు వీలైనంత త్వరలో వెబ్‌సైట్‌లో పెడతామని తెలిపారు

బారులు తీరిన అభ్యర్థులు 

రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష రాసేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులు బారులు తీరారు. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాలలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదన్న నిబంధనతో అభ్యర్థులు వేకువజాము నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్ని గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. అభ్యర్థుల చేతులకు మెహిందీ, టాటూలు ఉండకూడదని, మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదన్న నిబంధనలు ఉండటం వల్ల అభ్యర్థుల్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం పరీక్షా కేంద్రంలోని అనుమతించారు.కాగా పలు పరీక్షా కేంద్రాలకు కొందరు అభ్యర్థులు ఆలస్యంగా చేరుకున్నారు. నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉండటం వల్ల అభ్యర్థులు ఎంత వేడుకున్నా సిబ్బంది మాత్రం లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ పరీక్షాకేంద్రానికి ఒక అభ్యర్థి ఆలస్యంగా రాగా.. అతన్ని లోపలికి అనుమతించలేదు. అలాగే హనుమకొండలో ముగ్గురు, కొత్తగూడెంలో ఒకరు, సిద్దిపేటలో ఆరుగురు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒకటి రెండు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నారు. వాళ్లు వచ్చే సమయానికే గేట్లు మూసివేయటంతో ఇందులో ఎవ్వరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. చేసేదేమీ లేక అభ్యర్థులు నిరాశతో పరీక్షాకేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

కనీస అర్హత మార్కుల కుదింపు 

కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్‌స్సి/ఎస్‌టిలు 30శాతం, బిసిలు 35శాతం, ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు.

జిల్లాల వారీగా అభ్యర్థుల హాజరు 

హైదరాబాద్- 1లో 12302 మంది అభ్యర్థులకు గాను 11391మంది, హైదరాబాద్ -2లో 8472 మంది అభ్యర్థులలో 7863 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే హైదరాబాద్ -3లో 12996 గాను 12025 మంది, హైదరాబాద్ -4లో 8460 మంది అభ్యర్థులకు గాను 7751 హాజరయ్యారు. హైదరాబాద్ -5లో 9516 గాను 8563, హైదరాబాద్ -6లో 11076 గాను 9892, హైదరాబాద్ -7లో 8376 గాను 7226మంది, పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ -8లో 3468 మందికి 3036, హైదరాబాద్ -9లో 5532 గాను 4563, రంగారెడ్డి -1లో 6876 గాను 5377, రంగారెడ్డి2లో 7644 మందికి 6191, రంగారెడ్డి-3లో 16800గాను 13850, రంగారెడ్డి-4లో 9852 గాను 8488 మంది పరీక్ష రాశారు. అదేవిధంగా రంగారెడ్డి 5లో 13829 గాను 12606, రంగారెడ్డి-6లో 6985గాను 5607, మేడ్చల్ 1లో 11604 గాను 10527,

మేడ్చల్-2లో
13944 గాను 12570, మేడ్చల్-3లో 8484 మందికి 7455, మేడ్చల్ 4లో 14352 మందికి 12422, మేడ్చల్ -5లో 18840 గాను
15499, యాదాద్రి భువనగిరిలో 8335కి గాను 7710, నల్గొండ-1లో 11967 గాను 11554, నల్గొండ-2లో 11220 గాను
10409, మిర్యాలగూడలో 10140గాను 9112, హనుమకొండ 32934మందికి గాను 30492, వరంగల్ 13476 గాను 12568, జనగాం
6560 గాను 6142, కరీంనగర్ 1లో 20698 గాను 19782, కరీంనగర్ -2లో 6000 గాను 5288, మంచీర్యాల్ 7440 గాను
6995, పెద్దపల్లి 10349గాను 9665, బెల్లంపల్లి 5180గాను 4949, ఖమ్మం 8676గాను 8230, ఖమ్మం -2లో 11532 మందిలో 10783 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఖమ్మం 3లో 11207 గాను 10164, సత్తుపల్లి 8136గాను 6777, భద్రాద్రి కొత్తగూడెంలో 14221మందికి
13160, 92.54, భద్రాచలం 2856 గాను 2474, సూర్యాపేట్ 12552కి గాను 11913, ఆదిలాబాద్ 10513 గాను 10044, ఉట్నూర్‌లో
5964 గాను 5573, కొమరభీం – ఆసిఫాబాద్ 6722గాను 6387, జయశంకర్-భూపాలపల్లి 4755 గాను 4428, జోగులాంబ గద్వాల్
11420 గాను 10655, జగిత్యాల 8703గాను 7949మంది కామారెడ్డి 11042గాను 10373 మంది మహబూబ్‌నగర్ 17154గాను
16428 మంది, మహబూబ్‌నగర్ -2లో 7644 గాను 6924 మంది, మహబూబాబాద్ 10190గాను 9431, మెదక్ 8821గాను
8331, ములుగు 4008 గాను 3711, నాగర్‌కర్నూల్ 12528 గాను 11696, నారాయణపేట్ 4906 గాను 4635 మంది హాజరయ్యారు. సంగారెడ్డి 18451గాను 17157, సిద్ధిపేట్ 13890గాను 13075 మంది, రాజన్న సిరిసిల్ల 6909గాను 6461, వికారాబాద్ 10461గాను
10190 మంది, వికారాబాద్2లో 6612 గాను 6046 మంది, వనపర్తి 9706 గాను 9094 మంది హాజరయ్యారు. వెరసి 661198 మంది అభ్యర్థులకు గాను 603955 (91.34) అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News