Saturday, December 21, 2024

కార్పొరేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : జవహర్‌నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నగర మేయర్ కావ్య,డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ కెఎన్‌ఆర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.10లక్షల వ్య యంతో తలపెట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్‌తో కలిసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సహాకారంతో ప్రజల మౌళిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యాత కల్పిస్తు అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు.

స్మశానవాటిక రహదారి భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి అయిన వెంబడే సిసి రోడ్డు పనులను చేపడుతామని కార్పొరేటర్ బల్లి రోజాశ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బల్లిశ్రీనివాస్, బండకింది ప్రసాద్‌గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్, శాగంటి వెంకటేష్,నంగునూరి అశోక్‌గుప్తా, సిద్దులు యాదవ్, మూలసోమయ్యగౌడ్, పలాసకిరణ్, ప్రభాకర్,మురళి,జనార్ధన్, శ్యామల,అనిత, గిరి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News