Tuesday, January 21, 2025

పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మున్సిపల్ చైర్‌పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర చారి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 16, 7వ వార్డులలో ఆమె పర్యటించారు. టీచర్స్ కాలనీలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ముఖ్యంగా డ్రైనేజి సమస్య ఉందని కాలనీ వాసులు తెలుపగా సైడ్ కాలువల కోసం నిధులు మంజూరు అయ్యాయని, 25 నుంచి కాలువ పనులు ప్రారంభిస్తామని చైర్‌పర్సన్ తెలిపారు. అనంతరం 7వ వార్డులో ఆమె పర్యటించారు. పీర్ల చావిడి పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

నిర్మాణ పనులను త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, డివైడర్ పనులు పూర్తి అయ్యాయని, చౌరస్తాల సుందరీకరణ పనులు జరుగుతున్నాయని పట్టణంలో అవసరం ఉన్న ప్రతి దగ్గర నూతనంగా సిసి రో డ్లు, సైడ్ కాలువలు, వార్డులలో పార్కులు నిర్మిస్తున్నామని, పారిశుద్ధ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్ బరిగెల రాముడు యాదవ్, బిఆర్‌ఎస్ నాయకులు గోపాల్, మల్లయ్య, దిద్దాల స్వామి రెడ్డి, వెంకటస్వామి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News