- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
యాచారం: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. యాచారం మం డల కేంద్రంలో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.54 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న గోదాం నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
పిఎసిఎస్ సమీపంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నూతన గోదాం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని గిడ్డంగి నిర్మాణంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన వివరించారు. దీర్గకాలిక, స్వల్పకాలిక రుణాలు తీసుకొన్న రైతులు సకాలంలో తిరిగి చెల్లించి సహకార సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు.రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్షంగా సహకారం సం ఘాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తక్కువ వడ్డీతో రైతులకు రు ణాలు అందజేస్తున్నాయని డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తపరిచారు.
సహకారం సంఘాల సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ వంగేటి లకా్ష్మరెడ్డి సూచించారు.కార్యక్రమంలో డిసివో దాత్రీదేవి, డిసిసిబి వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపిపి కొప్పు సుకన్య బాష, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, పిఎసిఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి, ఎంపిడివో విజయలక్ష్మీ, తహశీల్దార్ సుచరిత, సిఐ లింగయ్య, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చబాష, బిఎన్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కంబాలపల్లి ఉదయశ్రీ, బండిమీది కృష్ణ, ఎండి. హబీబుద్దీన్, రమావత్ జగదీశ్, కె.సంతోష రమేశ్, కాశమళ్ల ఇందిర శ్రీనివాస్, ఎం.శ్రీధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తలారి మల్లేష్, ఎన్.శంకర్ నాయక్, సిఈవో నాగరాజు, సంఘం డైరెక్టర్లు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.