Wednesday, January 22, 2025

సమష్టి కృషితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు : ప్రజా ప్రతినిధుల సమష్టి కృషితోనే  సాధ్యమవుతుందని , రాష్ట్ర ముఖ్య మంత్రి అందజేయనున్న రూ. 15 లక్షలతో గ్రామల్లో అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపిపి సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పటాన్‌చెరు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్యసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే జిఎంఆర్‌ను స న్మానించారు.మరో సారి పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని గె లు పించాలన్న సిఎం కెసిఆర్ చెప్పిన మాటలకు స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గ్రామాల్లో మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత చెడు దారి మల్ల కుండా చూడాల్సిన బాద్యత సంబంధిత అధికారులపై ఉంద న్నారు.ప్రజల ఆకాంక్షలకు అనుగునంగా ప్రజాప్రతినిధులు పనిచే యా లని సూచించారు.తాను ఎంపిపిగా ఉన్న కాలంలో ప్రభుత్వ నిధుల కోసం కార్యాలయాల చుట్టు తిరుగాల్సి ఉండేదని తెలంగాణ ప్రభుత్వ హయాంలో మనవద్దకే లక్షల నిధులు వస్తున్నాయన్నారు.గ్రామల్లో శంకుస్థాపనలు చేసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి,సర్పంచ్ల్, ఎంపిటిసిలు , స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News