Wednesday, January 22, 2025

నియోజకవర్గ అభివృద్ధే ప్రతీ కార్యకర్త ధ్యేయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:బీఆర్‌ఎస్ పార్టీలు గ్రూ పుల గోల లేకుండా ప్రతీ కార్యకర్త నియోజకవర్గ అభివృద్ధినే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపగాని వేణుధర్ గౌడ్, పలువురు కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.

వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. పార్టీలో చేరిన వారిలో నాగభూషణంచా రి, చింతర వి, జాటోతు రమేష్, దశరథ, మొగిలి చిన్న వెంకన్న, ఎల్లయ్య, శరత్‌తో పాటు కార్యకర్తలు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు వంటెద్దు నర్సింహ్మారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, కోణతం స త్యనారాయణరెడ్డి, కసగాని బ్రహ్మం, కటికం శ్రీనివాస్, మొదుగు నాగిరెడ్డి, బత్తుల ప్రసాద్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News