Wednesday, January 22, 2025

నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50.40 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తన అభ్యర్థన మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 50 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం 30 కోట్ల రూపాయలు, మండల కేంద్రాల్లో సిసి రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ పట్టణంలో ఈద్గా, షాదిఖాన నిర్మాణం కోసం 3 కోట్ల 50 లక్షలు రూపాయలు, మున్సిపల్ పరిధిలోని సిసి రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం పది కోట్ల రూపాయలు, మమ్మాయిపల్లి నుంచి వడ్డెర కాలని వరకు కొత్తగా బిటి రోడ్డు నిర్మాణానికి కోటి 90 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.

శుక్రవార ం సాయంత్రం సిఎం కెసిఆర్‌ను ప్రత్యేకంగా కలిసి విన్నవించడంతో వెంటనే స్పందించిన సిఎం 50 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేస్తూ జీఓ నెంబర్ 244 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గ ప్రజల తరపున సిఎం కెసిఆర్‌కు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News