Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల టౌన్: బిఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి బిఆర్‌ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల పట్టణంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గద్వాల మున్సిపాలిటి పరిధిలోని జమ్మిచేడు 4,5 వార్డులకు చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్వాల ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి మరే పార్టీ చేయలేదని దీని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. బిఆర్‌ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. గౌని ఆంజనేయులు, గౌని రాములు, వెంకటస్వామి, శ్రీను, నర్సింహులు, ఆంజనేయులు, వెంకటేష్, బీసన్న, పరుశరాముడు, నవీన్, శివ, శీను, జామీర్, నాసిర్, కురువ జయన్న, తదితరులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్, నాయకులు రాముడు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News