Monday, December 23, 2024

ఢిల్లీ ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ ధర్మాసనం తేల్చాల్సిందే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ పాలనా వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ పలు రాజ్యాంగ విస్తృత అంశాల విశ్లేషణకు దారితీస్తోంది. ఉద్యోగుల సేవల సంబంధిత ఆర్డినెన్స్‌తో ఇక ఢిల్లీ పాలనా అంశాలలో పార్లమెంట్ ద్వారా చట్టాలు చేసేందుకు వీలుందా? పాలనా పద్ధతులకు సంబంధించి ఉన్న రాజ్యాంగ సూత్రాలను పార్లమెంట్ రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని, వీటిని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. కేంద్రం ఆప్ ప్రభుత్వం మధ్య ఈ ఆర్డినెన్స్ తీవ్రస్థాయి వివాదానికి దారితీసింది. ఢిల్లీలో వేరే ప్రభుత్వం ఉంది. అక్కడి ఉద్యోగుల సేవలు, బదిలీలు నియామకాల ప్రక్రియలు, చివరికి నగర విధాన నిర్ణయాల అధికారాన్ని పార్లమెంట్ ద్వారా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవచ్చునా? అనేది కీలకమైన ప్రశ్న అని, దీనిని కేవలం విస్తృత రాజ్యాంగ ధర్మాసనమే పరిశీలించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రాజ్యాంగ ధర్మాసనం ద్వారా విచారణకు జాప్యం జరుగుతుందని, వెంటనే విచారణ చేపట్టాల్సి ఉందనే ఆప్ ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన అంశం కాబట్టి, త్రిసభ్య ధర్మాసనం దీనిని ఆ ధర్మాసనానికే నివేదిస్తుంది. ఇదే దశలో ఇప్పటికే ఏర్పాటు అయి ఉన్న పలు రాజ్యాంగ ధర్మాసనాల పరిధిలో ఇతరత్రా కీలక వ్యాజ్యాల విచారణ సాగుతున్నందున త్వరలోనే ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు తరువాత దీనికి సంబంధిత పక్షాలు అప్పీలు చేసుకుంటే విచారణకు వీలేర్పడుతుందని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రూలింగ్ వెలువరించింది. కేంద్రం , రాష్ట్రాల అధికారాలు, ప్రత్యేకించి దేశ రాజధాని పరిధిలో కేంద్రం నిర్ణయాల చెల్లుబాట్లు, ఉమ్మడి ప్రాదేశిక సూత్రాల వంటి పలు విషయాలను కూలంకుషంగా చర్చించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News