Sunday, December 29, 2024

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దీపిక

- Advertisement -
- Advertisement -

‘దేశమే ముందు’ సెంటిమెంట్ భారత రాజ్యాంగాన్ని చిరస్థాయి చేస్తుంది
రాజ్యాంగం ‘నిరంతరం పారే ఏరు’: ప్రధాని మోడీ అభిభాషణ
సుప్రీం కోర్టులో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాజ్యాంగాన్ని ‘సజీవ ఏరు’గా శ్లాఘించారు. భారత్ పరివర్తన సమయంలో ముందుకు సాగుతున్నప్పుడు అది ‘మార్గదర్శక కిరణం’గా ఉపకరించిందని ప్రధాని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామిక దీపిక అని అభివర్ణించారు. సుప్రీం కోర్టులో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన మోడీ ముంబయి ఉగ్ర దాడి హతులకు నివాళి అర్పించారు. దేశ భద్రతను సవాల్ చేసే ఉగ్ర మూకలు అన్నిటికీ గట్టి గుణపాఠం చెప్పాలన్న దేశం కృతనిశ్చయాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు.

1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో రాజేంద్ర ప్రసాద్ ముగింపు ఉపన్యాసంలో వాడిన మాటలను మోడీ గుర్తు చేస్తూ, స్వప్రయోజనాలకు మించి దేశ ప్రయోజనాలను కాపాడు నిజాయతీ వ్యక్తుల బృందం కన్నా భారత్‌కు ఏదీ అక్కరలేదని అన్నారు. “దేశమే ముందు’ అన్న సెంటిమెంట్ రానున్న శతాబ్దాలకు రాజ్యాంగాన్ని సజీవంగా నిలుపుతుంది’ అని ఆయన సూచించారు. రాజ్యాంగాన్ని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో అమలుపరచినట్లు, అక్కడ మొదటిసారిగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించినట్లు మోడీ తెలియజేశారు. ‘భారత్ ఆకాంక్షలు, భారత్ కలలు కాలం గడిచే కొద్తీ కొత్త పుంతలు తొక్కుతాయని మన రాజ్యాంగ నిర్మాతలకు తెలుసు. స్వతంత్ర భారత్, ప్రజల అవసరాలు మారుతాయని, సవాళ్లు మారతాయని వారికి తెలుసు. దానిని సజీవ, నిరంతరం పారే ఏరుగా చేశారు’ అని మోడీ చెప్పారు.

ప్రతి ప్రభుత్వ విభాగం రాజ్యాంగం నిర్దేశిత పాత్ర పోషించాలి: సిజెఐ
ప్రభుత్వంలోని ప్రతి విభాగం అంతర్ వ్యవస్థ సమతౌల్యతను పాటించడం ద్వారా తనకు రాజ్యాంగం నిర్దేశించిన పాత్రను గౌరవించాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా మంగళవారం ఉద్బోధించారు. దేశ రాజధానిలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సిజెఐ ప్రసంగిస్తూ, ప్రభుత్వంలోని ప్రతి విభాగం స్వ తంత్ర కక్షలో తిరిగి ఉపగ్రహం కాదని, సంబంధిత వ్యవ స్థ అని పేర్కొన్నారు. ‘రూపకల్పన ద్వారా రాజ్యాంగం ఎన్నికల చట్టాల లోటుపాట్ల నుంచి న్యాయవ్యవస్థకు రక్షణ కల్పిస్తున్నది. ఇది నిర్ణయాలు దురుద్దేశాల రహితంగా, నిష్పక్షపాతంగా, రాజ్యాంగం, చట్టాల మార్గదర్శకత్వంలో సాగేలా చూస్తుంది. అదే సమయంలో ప్రభుత్వంలో ప్రతి శాఖ స్వతంత్ర కక్షలోని ఉపగ్రహం కాకుండా, ప్రత్యేకతతో పని చేసే సంబంధిత వ్యవస్థ. ప్రతి విభాగం అంతర్ వ్యవస్థ సమతౌల్యత పాటిస్తూ రాజ్యాంగం తనకు నిర్దేశించిన విశిష్ట పాత్రను గౌరవించాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రత ఒక ఎత్తైన గోడ వలె కాకుండా ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’ అని సిజెఐ అన్నారు.

భారతీయ న్యాయస్థానాల్లో నమోదు అవుతున్న కేసుల సంఖ్య ‘బాగా అధికంగా’ ఉంటున్నాయని, ఈ ఏడాదిలోనే న్యాయవ్యవస్థ జిల్లా కోర్టుల్లో 208 వేల కోట్లకు పైగా కేసులు, హైకోర్టుల్లో దాదాపు 16.6 లక్షల కేసులు, సుప్రీం కోర్టుల 54 వేల కేసులు వచ్చాయని ఖన్నా తెలియజేశారు. అందువల్ల జిల్లా కోర్టుల్లో 4.54 కోట్లకు పైగా కేసులు, హైకోర్టుల్లో 61 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండడం ఆశ్చర్యకరం కాదని ఆయన చెప్పారు. గడచిన సంవత్సరంలోనే మన జిల్లా కోర్టులు 20 లక్షలకు పైగా క్రిమినల్ కేసులు, 8 లక్షలకు పైగా సివిల్ కేసులను పరిష్కరించాయని ఆయన తెలిపారు. ఇక సుప్రీం కోర్టులో కేసుల పరిష్కారం రేటు 95 శాతం నుంచి 97 శాతానికి పెరిగిందని సిజెఐ వెల్లడించారు. ఈసదస్సులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News