దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన
పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం
విద్యుత్‌శాఖ సీఎండి రఘుమారెడ్డి
మన తెలంగాణ,సిటీబ్యూరో : మన దేశఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవిత్ర గ్రంధం మన రాజ్యాంగమని దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ’( టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ ) సీఎండి జి. రఘమారెడ్డి అన్నారు. శుక్రవారం మింట్ కంపౌండ్‌లోని విద్యుత్‌శాఖ ప్రధాన కార్యాలయంలో 73 రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వివిధ వర్గాలు, మతాలు, కులాలు కలిగి ప్రప్రంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కార్యనిర్వాహక శాసన, న్యాయ వర్గాలు ఏవిధంగా ముందుకు వెళ్ళాలో దిశ నిర్దేశ్యం చేసిందని మన రాజ్యాంగమన్నారు. భారత మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రాజ్యాం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ సారిధిగా కమిటీ ఏర్పాటైందన్నారు. రాజ్యాంరూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళతమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పలు సేవలను సీఎండి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకుముందు ఆయన రాజ్యంగ పీఠికను చదివి అధికారులు, ఉద్యోగులతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరక్టర్లు టి.శ్రీనివాస్,కె.రాములు, జి. పర్వతం, సిహెచ్ మదన్మోహన్‌రావు, ఎస్. స్వామిరెడ్డి, పి. నరసింహరావు, జి.గోపాల్ ఇతర సీజీంఎలు అధికారుల పాల్గొన్నారు.