Friday, January 24, 2025

రాజ్యాంగ లక్షణాలు

- Advertisement -
- Advertisement -

Constitution of india articles in telugu pdf

భారత రాజ్యాంగ లక్షణాలు
అతిపెద్ద లిఖిత రాజ్యాంగం
ఆమోదిత రాజ్యాంగం
దృఢ, అదృఢ రాజ్యాంగం
ఏక కేంద్ర, సమాఖ్య
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
ఏక పౌరసత్వం
సార్వాత్రిక వయోజన ఓటుహక్కు
ప్రాథమిక హక్కులు
ప్రాథమిక విధులు
ఆదేశ సూత్రాలు

అతిపెద్ద లిఖిత రాజ్యాంగం

1935 చట్టంలో 321 ఆర్టికిల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి.
బి.ఎన్‌రావు రచించిన చిత్తు రాజ్యాంగంలో 240 నిబంధనలు, 13 షెడ్యూల్స్ ఉన్నాయి.
ముసాయిదా రాజ్యాంగంలో 315 నిబంధనలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి.
రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికిల్స్, 8 షెడ్యూల్స్ కలవు.
ప్రస్తుతం 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి.
ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం
ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం
హెచ్‌వి కామత్ రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు.
భారత రాజ్యాంగాన్ని ఐవర్ జన్నింగ్స్ ప్రపంచంలోకెల్లా అత్యంత సుదీర్ఘమైన రాజ్యాంగంగా అభివర్ణించాడు.
అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ బ్రిటన్.
బ్రిటన్‌లో పార్లమెంట్‌కే అధికారాలు ఎక్కువగా ఉన్నాయి.
బ్రిటన్ పార్లమెంట్‌కు తిరుగులేని అధికారులు ఇవ్వబడ్డాయి.
అక్కడి పార్లమెంట్ చట్టాల మధ్య న్యాయ సమీక్షకు అవకాశం లేదు.
ఇది ఒక అలిఖిత రాజ్యాంగం.
పార్లమెంట్ ఏది చట్టం చేస్తే అదే బ్రిటన్ రాజ్యాంగం.
బ్రిటన్‌లో ప్రత్యేకంగా రాజ్యాంగం అంటూ ఉండదు.
ఎప్పటికప్పుడు బ్రిటన్ రాజ్యాంగం నిత్య నూతనంగా ఉంటుంది.

ఆమోదిత రాజ్యాంగం

భారత రాజ్యాంగం ప్రజల చేత ఆమోదించబడింది.
అనగా రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించారు.
ఇంగ్లాండు నుండి ప్రసాధించబడిన రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం
దృఢ, అదృఢ రాజ్యాంగం

దృఢ రాజ్యాంగం అంటే కేంద్రంతో పాటు 3 /4 రాష్ట్రాలు ఉండాలి
రాజ్యాంగంను సవరించే పద్ధతి చాలా కష్టతరం. దీనికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం.

అదృఢ రాజ్యాంగం: రాజ్యాంగ సవరణ సులభం, ఉదాహరణ బ్రిటన్
భారత రాజ్యాంగం దృఢ, అదృఢల కలయిక.

ఏకకేంద్ర, సమాఖ్య రాజ్యం
ఏకకేంద్ర రాజ్యం: అధికారాలు మొత్తం కేంద్రం వద్దనే ఉంటాయి. ఉదాహరణ ఇంగ్లండ్
సమాఖ్య రాజ్యం
అధికారాలు కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగితే సమాఖ్య. ఉదాహరణ అమెరికా.
భారతదేశం ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు కలిగి ఉంటుంది.
ఏకకేంద్ర లక్షణాలు
ఒకే రాజ్యాంగం
ఒకే రాష్ట్రపతి
ఒకే కాగ్
ఒకే యూపీఎస్సీ
ఏకీకృత న్యాయవ్యవస్థ
అవశిష్ట అధికారాలు కేంద్రం వద్ద ఉండటం
సమాఖ్య లక్షణాలు
అధికారాల విభజన (కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు)
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి (ఎంఎల్‌ఏలు కూడా పాల్గొనడం)
రాజ్యాంగ సవరణ (కొన్ని బిల్లులకు రాష్ట్రాల ఆమోదం)
న్యాయ సమీక్షాధికారం (స్వతంత్ర న్యాయవ్యవస్థ)
లిఖిత రాజ్యాంగం (రాజ్యాంగంలోని కొన్ని అంశాలు రాష్ట్రాలకు సంబంధించినవి)
భారత రాజ్యంగం ఒక అర్థ సమాఖ్య అని కె.సి వేర్ వ్యాఖ్యానించారు.
ఏక కేంద్రం వైపు మొగ్గుతున్న సమాఖ్య అని అంబేద్కర్ అన్నారు.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
ఇంగ్లండ్ పార్లమెంట్‌ను ప్రపంచ పార్లమెంట్‌ల మాత అని అభివర్ణిస్తారు.
పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాన్ని ఇంగ్లండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం.
మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి సమిష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది.
పార్లమెంటు తరహా ప్రభుత్వంలో రెండు రకాల అధిపతులు ఉంటారు. వారు1. రాష్ట్రపతి 2. ప్రధాన మంత్రి
రాష్ట్రపతి రాజ్యాంగాధిపతి. ప్రధాని ప్రభుత్వాధిపతి.
రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు ఉంటాయి.

మీ ప్రశ్న..
మా సమాధానం.

ప్రశ్న: మన తెలంగాణ న్యూస్ పేపర్‌లో వచ్చే స్టడీ మెటీరియల్ చాలా బాగుంది. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో తెలియజేయండి?
(పి. ప్రశాంత్, వరంగల్ జిల్లా)
జవాబు: కరెంట్ అఫైర్స్‌ని ఒకే సారి పరీక్ష ముందే చదవకుండా ప్రారంభం నుంచే జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు రాష్ట్రాలు తదితర వర్తమానాంశాలపై దృష్టి పెట్టాలి. వార్తా పత్రికల్లో వచ్చే కరెంట్ అఫైర్స్‌ని ఎప్పటికప్పుడే చదివి అంశాల వారీగా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ప్రశ్న: జనరల్ స్టడీస్‌లో సిలబస్ అన్‌లిమిటెడ్‌గా ఉంది. సిలబస్‌కి లిమిట్స్ ఉంటాయా.. తక్కువ రోజుల్లో ప్రిపరేషన్ ఎలా పూర్తి చేయాలి?
(కె. పావని, ఖమ్మం జిల్లా )
జవాబు: జనరల్ స్టడీస్ అనేది సముద్రంలా కనిపిస్తుంది. కానీ ఒక ప్రణాళికా బద్ధంగా చదివితే సిలబస్‌ని పూర్తి చేయవచ్చు. అందుకు ప్రీవియస్ పేపర్లు బాగా ఉపయోగపడతాయి. సిలబస్‌లో ఇచ్చిన టాపిక్స్ ప్రకారం చదివి.. ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే .. సిలబస్‌పై పట్టు వస్తుంది. ఎన్నిపేపర్లు ప్రాక్టీసు చేస్తే అంత మంచిది. దీనివల్ల తక్కువ సమయంలో ప్రిపరేషన్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

ప్రశ్న: పోటీ పరీక్షల్లో కొత్తగా వచ్చినవారు విజయంసాధించగలరా..? లేదా సీనియర్లకే ఈ ఉద్యోగాలు సాధించే నాలెడ్జ్ ఉంటుందా తెలపండి?
(సీహెచ్ ఆనంద్, కరీంనగర్ జిల్లా)
జవాబు: ఈ పరీక్షల్లో విజయం సాధించేది సిలబస్ ప్రకారం మొత్తం టాపిక్స్‌పై పట్టు సాధించినవారే… ఎవరైతే ఆత్మ విశ్వాసంతో పూర్తి స్థాయిలో సమయం కేటాయించుకుని చదువుతారో వారినే విజయం వరిస్తుంది. అది సీనియర్లు అయినా జూనియర్లు అయినా..! కనుక ఆత్మవిశ్వాసంతో వంద శాతం ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్లండి. విజయం అదే వస్తుంది.

డా.బిఎస్‌ఎన్ దుర్గాప్రసాద్, డైరెక్టర్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News