Wednesday, January 22, 2025

ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

బీజేపీ నుంచి అధికారులకు బెదిరింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢితమ ల్లీలో తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని, తమకు బీజేపీ నుంచి బెదిరింపులు, ఒత్తిడులు ఎదురౌతున్నందున తాము పనిచేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన ఈ విషయం వివరించారు. ఢిల్లీలో వేరే పార్టీ అధికారంలో ఉన్నందున ఈ సమస్య తలెత్తి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి అధికారం లేకుండా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ కి ఢిల్లీలో ఎన్నికైన పార్టీ తన పనిచేయడం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

నీటి బిల్లులను సరిచేసే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని కొందరు అధికారులు బీజేపీ నుంచి వచ్చే బెదిరింపుల వల్ల అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే బీజేపీ నుంచి తక్షణం స్పందన కనిపించలేదు. ఈ పథకం క్లియరెన్స్ కోసం అధికారులను ఆదేశించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వన్‌టైమ్‌సెటిల్‌మెంట్ పథకం వల్ల 10.5 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ఆయన వివరించారు. ఢిల్లీలోని అధికశాతం జనాభా తప్పుడు బిల్లులు, ఎక్కువ ఛార్జి బిల్లుల బాధితులని పేర్కొన్నారు.

అందుకనే ఈ బిల్లులను సవరించేందుకు తాము వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని గత ఏడాది జూన్‌లో ప్రవేశ పెట్టామని, అది వెంటనే అమలు కావలసి ఉందన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, కానీ ప్రతిపక్షబీజేపీ ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని, అసెంబ్లీలో తమకు అసెంబ్లీలో మూడు లేదా ఎనిమిది సీట్లు తగ్గేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆరోగ్య సేవలను కూడా ఆపడానికి వారు ప్రయత్నిస్తున్నారని, అనేక మొహల్లా క్లినిక్‌లకు అద్దెలు కూడా చెల్లించడం లేదని కేజ్రీవాల్ చెప్పారు.

“మీ కుమారుడు కేజ్రీవాల్ బతికి ఉన్నంతకాలం బీజేపీ ముందు గోడలా అడ్డంగా ఎదుర్కొంటాడని” వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తన 15 నిముషాల ప్రసంగంలో ప్రతిపక్ష నాయకుడు రామ్‌వీర్ సింగ్ బిధూరీని కూడా అపహాస్యం చేయడానికి ప్రయత్నించారు. నీటిబిల్లుల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఢిల్లీలో అమలు కాకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వస్తుందని హెచ్చరించారు. ఇది సరైన మార్గంలో సాధ్యం కాకుంటే తాము వేరే కష్టమైన మార్గాన్ని అనుసరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News