Monday, December 23, 2024

ఖానాపూర్‌లో 13 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నీటి పారుదల శాఖను పున వ్యవస్థీకరణ చేసి ఖానాపూర్ నియోజకవర్గంలో కొత్తగా 13 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాంనాయక్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఖానాపూర్‌లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జె.కె ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖశ్యాంనాయక్, మండల ప్రత్యేక అధికారి డిఆర్‌డిఓ పిడి విజయలక్ష్మీ, నీటి పారుదల శాఖ నిర్మల్ ఈఈ.ఆర్ విఠల్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014కు ముందు ఖానాపూర్ నియోజకవర్గంలో పంటల దిగుబడి తక్కువగా ఉండి నాటి చెరువులు, కుంటలను ఎవరు పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వాటన్నింటిని మరమ్మతులు చేసి కొత్తగా 13 చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడంతో రైతులు పంటల దిగుబడి పెరిగిందని దీంతో రైతులందరూ ఆనందంగా ఉన్నారన్నారు. గత సంవత్సరం కురిసిన వర్షాల వలన కడెం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్ట్‌ను కాపడటానికి మంత్రి ఐకె రెడ్డి, తాను ఇప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీలు ప్రాజెక్ట్ సిబ్బందిని ప్రాణాలను పణంగా పెట్టి తెగిపోయే దశలో ఉన్న ప్రాజెక్ట్‌ను కాపాడడం జరిగిందన్నారు. సదర్మాట్ పేరు మీద గతంలో ఎన్నో ప్రభుత్వాలు ప్రాజెక్ట్‌ను నిర్మిస్తామని కొబ్బరి కాయలు కొట్టి ఓట్లు వేయించుకొని రైతులను మోసం చేశారే తప్ప ఆధుకున్న పాపన పోలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత ఈ ప్రాంత రైతుల జీవనాధారం అయినా సదర్మాట్ ఆయకట్టను భ్యారేజీగా ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేశారని,ఆ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తవుతందని ఇక ఈ ప్రాంత రైతులకు రెండు పంటలకు సాగు నీరుకు డోకా ఉండదన్నారు.
గత 50 సంవత్సరాల క్రితం నుంచి పెంబి మండలంలోని పెల్కెరి వాగును ఎవరు పట్టించుకోలేదని సీఎం కెసిఆర్ హాయంలో ఆ వాగు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 60 సంవత్సరాలలో చేయని పనులను పది సంవత్సరాలలో చేసి చూపించిన ఘనత సీఎం కెసిఆర్‌దేనన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,వైస్ చైర్మన్ కలీల్, ఎంపీపీ మోహిద్, కిషన్, ఎఎంసి మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, ఇంద్రవెల్లి చైర్మన్ శ్రీ రాం నాయక్, తహసీల్థార్లు రాజ్ మోహన్, శ్రీధర్, లక్ష్మీ, మాజీ జెడ్పిటిసి రాథోడ్ రామ్ నాయక్, కౌన్సిలర్లు కావాలి సంతోష్, తొంటి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు కిషోర్, ఆర్‌సస అధ్యక్షుడు పుప్పాల గజేందర్, నీటి పారుదల శాఖ డి.ఈ.లు సురేంధర్, బోజాదాస్, ఎఈలు నవీన్‌కుమార్, ఉదయ్ కుమార్, రవి కుమార్, గణేష్, ఆర్. విఠల్, ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News