- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ లో 37 లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టామని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఓఆర్ఆర్ పై రూ. వంద కోట్లతో ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఓఆర్ఆర్ పై 27కిలో మీటర్ల సైకిల్ ట్రాక్ నిర్మిస్తామని కెటిఆర్ పేర్కొన్నారు. మూసీ నదిపై 14 వంతెనలు నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. వరుసగా ఆరేళ్ల అత్యుత్తమ నివాస నగరంగా హైదరాబాద్ నిలిచిందని కెటిఆర్ తెలిపారు. ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో హైదరాబా్ ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ లో 12 అవార్డులు వచ్చాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -