Monday, December 23, 2024

2040 నాటికి చంద్రుడిపై 3 డీ ఇళ్ల నిర్మాణం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత్ సహా పలు దేశాలు చంద్రుడి గుట్టు విప్పేందుకు ఎంతో కాలంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. చంద్రుడిపై మానవాళి జీవనానికి అనువైన వాతావరణం ఉందా ? అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం నాసా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల కోసం వ్యోమగాములు అధిక సమయం అక్కడే ఉండేందుకు ఈ నిర్మాణాలు తోడ్పడతాయని నాసా భావిస్తోంది.

3 డీ ప్రింటర్ సాయంతో రాక్ చిప్స్, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. “ కొన్నిసార్లు ఇది కలలా అనిపించవచ్చు. కానీ ప్రైవేట్ కంపెనీలు , యూనివర్శిటీలను భాగస్వాములను చేస్తూ ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. 2024 ఫిబ్రవరిలో 3 డీ ప్రింటర్‌ను చంద్రుడి ఉపరితలం పైకి పంపాలని నిర్ణయించాం. ప్రస్తుతం ప్రింటర్ పనితీరును పరీక్షిస్తున్నాం. ” అని నాసా సాంకేతిక విభాగం డైరెక్టర్ నిక్కీ వెర్కీసర్ తెలిపారు. ఆర్టెమిస్ 1 ప్రయోగం తర్వాత నాసా ఆర్టెమిస్ 2, ఆర్టెమిస్3 యాత్రను నిర్వహించనుంది.

అందులో నలుగురు వ్యోమగాములు ఉంటారు. వారు చంద్రుడిపై దిగకుండా , ఉపరితలానికి 9 వేల కిలోమీటర్ల దూరం లోని కక్షలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం అదే అవుతుంది. 2025లో ఆర్టెమిస్ 3 జరుగుతుంది. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారని నాసా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News