Wednesday, January 22, 2025

భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట  : భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మాణంలో గల సఖిసెంటర్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, మిట్టపల్లి లో జిల్లా మహిళా సమైక్యభవనం, వృద్ధ్దాశ్రమం నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థ్ధాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడ లేని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ్దతో సిద్దిపేట పట్టణంలో మహిళలు, వర్కింగ్ ఉమెన్స్ మహిళా స్వయం సహాయక సంఘాలు, వృద్ధుల కోసం సఖి సెంటర్, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్, జిల్లా మహిళా సమైక్య సంఘ భవనం, వృద్ధ్దాశ్రమంను వారికి అనుకూలమైన సురక్షితమైన ప్రాంతాలలో నిర్మించేందుకు చర్యలు చేపట్టారన్నారు.

అనుకున్న రీతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ నిర్మాణ పనులు మరింత త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు చొరవ చూపాలన్నారు. నాణ్యతలో ఎక్కడ కూడా రాజీ పడకుండా భవనాలను నాణ్యమైన మెటీరియల్స్‌తో స్టాంగ్‌గా నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, డిఆర్డిఓ మోహన్ రెడ్డి, ఆయా నిర్మాణాల ఇంజనీరింగ్ అధికారులు ,కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News