Monday, December 23, 2024

తెలంగాణ గర్వపడేలా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రపంచస్థాయి సాంకేతికతతో, అబ్బురపరిచే పరిజ్ఞానంతో టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని తె లంగాణ గర్వపడేలా రూపోందించడం జరిగిందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు . ఆదివారం కరీంనగర్ పట్టణంలోని వి కన్వేన్షన్ హాల్లో కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభ వేడుకలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ కు తలమానికంగా నిలువనున్న కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర ఐటి పుర పాలక శాఖమాత్యులు కేటి రామారావు చేతుల మీదుగా ఈనెల 21 కేబుల్ బ్రిడ్జీని ప్రారంభించుకొని, డైనమిక్ లైట్లను ప్రారంభించుకోవడం జరుగుతుందని, అనంతరం మంత్రి మానేరు రివర్ ఫ్రంట్ ను వీక్షించి, సాంస్కృతిక కార్యక్రమాల తరువాత సభ ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

నగరాన్ని ఆనుకొని 24 టియంసీల మానేరు నది ఏ నగరంలో లేదని, అంతటి అద్బుతమైన మానేరు ఉన్న కరీంనగర్ను అద్బుతంగా తీర్చిదిద్దేలా కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా కేబుల్ బ్రిడ్జి పై 30X10 సైజులో స్క్రీన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని దక్షిణ భారతదేశంలోనే గోప్ప పర్యాటక నగరంగా కరీంనగర్ వెలుగొందనుందని అన్నారు.

గతంలో కల్లోలిత ప్రాంతంగా,గుంతలమయమైన రోడ్లు వెనకబడిపోయిన నగరంగా ఉన్న కరీంనగ ర్ జిల్లాను అద్బుతంగా తీర్చిదిద్దడం జరిగిందని, ఇప్పుడు నగరంలో ఏమూల చూసిన అద్భుతమైన రోడ్లు, లైటింగ్ సిస్టంతో మౌ లిక సదుపాయాలు కల్పించి అద్భుతంగా దిద్దడం జరిగిందని తెలిపారు. ఈ నెల 22 న కూడ కేబుల్ బ్రిడ్జి వద్ద సాయంత్రం సాం స్కృతిక కార్యక్రమాలు ఉంటాయని మంత్రి తెలిపారు.ఈ నెల 21,22 తేదీల్లో ప్రజలందరూ పాల్గొనలా చూడాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, కేబుల్ బ్రిడ్జికరీంనగర్ కు ఓ ఐకాన్ గా నిలువనుందని, ఇంతఅద్బుతమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేసిన అధికారులు కష్టపడి పనిచేశారని వారందరికి కృతజ్ఞతలను తెలియజేశారు. రానున్న రోజులలో కేబుల్ బ్రిడ్జి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేందుతుందని తెలిపారు. దేశంలో కేబుల్ బ్రిడ్జ్, రివర్ ఫ్రంట్ ఉన్న జిల్లా ఎక్కడ లేదని,2 సంవత్సరాలలో బాగా మార్పు వస్తుందన్నారు.

సిపి సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రపంచస్థాయి ప్రమాణాలతొ కేబుల్ బ్రిడ్జిని రూ పొందించడం జరిగిందని, హైదరాబాద్ నగరంలోని నక్లెస్ రోడ్డు, పార్కులను అద్బుతంగా చూపిస్తారని, కరీంనగర్ లో నిర్మితమైన కేబుల్ బ్రిడ్జి వాటిని మించిన స్థాయిలో నిలిచిందని తెలిపారు. అంతకుముందు మంత్రి కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ వద్ద ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ఆర్డిఓ ఆనంద్ కమార్, ఎసిపి తులశ్రీనివాస్, గ్రందాలయ చైర్మన్ పోన్న అనీల్ కమార్, మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణ, మాజి ఎమ్మెల్సి నారాదాసు లక్ష్మ్ ణ్ రావు, కొత్తపెల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రుద్రరాజు, యంపిపి లక్ష్మయ్య, ఆర్ అండ్ బి ఈఈ సాంబశివరావు,మున్సిపల్ కమీషనర్ సేవాఇస్లావత్, వివిధ శాఖల అధికారులు కార్పొరేటర్లు తదితరులు, పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News