Thursday, January 23, 2025

అవసరమైన అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : మండల పరిధిలోని అవసరమైన అన్ని గ్రామాలలో సిసి రోడ్లు ఏర్పాటు చేస్తామని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శుక్రవారం కారేపల్లి మండలంలో ఆయన పర్యటించారు. ఇటీవల కారేపల్లి క్రాస్ రోడ్‌లో ఎమ్మెల్సీ నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్లను ఏర్పాటు చేశారు.

ఏర్పాటు చేసిన సిసి రోడ్లను ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో గ్రామాలలో సిసి రోడ్ల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు తాత మధు అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు పెద్ద బోయిన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్, వైస్ ఎంపిపి రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు,

దేవాలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, మండల రైతు బంధు కన్వీనర్ ఈసాల నాగేశ్వరరావు, నాయకులు ముత్యాల సత్యనారాయణ, అజ్మీరా వీరన్న ,ముత్యాల వెంకట అప్పారావు, అడపా పుల్లారావు, మరసకట్ల రోశయ్య, సర్పంచులు కిషోర్, కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News