Friday, December 20, 2024

ప్రారంభానికి ముందే శిథిలావస్థలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

- Advertisement -
- Advertisement -

మధిర: మధిర మండలంలోని ఇల్లూరు గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పై వారికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ కోరారు. డివైఎఫ్‌ఐ-ఏఐఏడబ్ల్యుయు ప్రజా సంఘల ఆధ్యర్యంలో మధిర మండoల ఇల్లూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన చేసి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో సుమారు కోటిన్నర వ్యయంతో నిర్మిస్తున్న 30 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణ దశలోనే,బేస్మెంట్  లోపల మట్టికి బదులు పత్తి కట్టే చెత్త చేదరం, గాలికి ఊగుతున్న పిల్లర్స్ ,స్లాబులు కురుస్తూ, పెచ్చులు ఉడుతు దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా ప్రారంభానికి నోచుకోకముందే డబుల్ బెడ్ రూమ్ గృహాలు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి.

రూ. 5 లక్షల పైగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూరి గుడిసెల కన్నా అధ్వానంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శిశారు. అనేక నియమ నిబంధనలు విధించినప్పటికీ, ఎటువంటి మెటీరియల్ వాడాలో, ఏ విధంగా ఇల్లు కట్టి పేదవాడికి అప్పగించాలో కాగితాల పై వ్రాసుకున్నప్పటికీ అవన్నీ బుట్ట దాఖలవుతూ కాసులకు కక్కుర్తిపడి, కాంట్రాక్టర్లు అధికారుల ధన దాహానికి లోనై ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారని నాసిరకమైన ఇటుక, నాసిరకమైన సిమెంట్, నాసిరకమైన ఇసుక, నాసిరకమైన స్టీల్, వాడుతూ చిన్నపాటి వర్షం వస్తే బీటలు వారి చెమ్మలు దిగడం కనిపిస్తున్నాయి. నాసిరకం ఇళ్లు నిర్మించడం ఇదంతా ఎవరినీ బాగుచేయడం కోసం అని ప్రశ్నిశారు.

ఒకవైపు కాంట్రాక్టర్లు ధన దాహం కోసం నాసిరకం ఇళ్లు నిర్మిస్తుంటే మరొకవైపు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ళ మత్తులో పడి పట్టించుకోవడం పేదలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లూరు గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తున్న కాంట్రాక్టర్లపై వారికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రజలను సమీకరించి ప్రత్యక్ష ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏఐఏడబ్ల్యుయు జిల్లా సహాయ కార్యదర్శి తెలప్రొలు రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు,కిరణ్, నాగేశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News