Monday, January 20, 2025

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ఆదేశాలతో ఆసుపత్రి భవన నిర్మాణం

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు :స్థానిక నియోజకవర్గ రైతులు (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో వేసిన కేసుతో ట్రిబునల్ ఆదేశాల మేరకే ఆసుపత్రి ఏర్పాటు జరుగుతుందని,స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఎంత మాత్రం లేదని పటాన్ చెరు మాజీ జడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇస్నాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ స్వయంగా రాష్ట్ర ముఖ్య మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేదని మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొరువతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని చెప్పారన్నారు.

ఆసుపత్రి ఏర్పాటుకు పోరాటం చేసింది స్థానిక రైతు బిఎన్ రెడ్డి తోపాటు 18 మంది రైతులున్నారని వెల్లడి ంచారు.వీరందరికి పర్యావరణ వేత్త కిషన్‌రావు మద్దతుగా ఉన్నారన్నారు. వీరి తరపున ఎన్‌సి మెహత, నిరుప్ రెడ్డి,నాగేశహిల్‌ల వాదనలు విన్న తర్వాత 2017 సంవత్సరంలో వచ్చిన జెడ్జిమెంట్ ఆదారంగా పొల్యుషన్ బోర్డు 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చే నిర్నించ బోతున్న ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాంత ప్రజల అవసరాలు గుర్తించి ఆసుపత్రి నిర్మిస్తున్నామని చెప్పు కోవడం సిగ్గు చేటన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News