Monday, January 20, 2025

అన్ని వసతులతో నూతన గ్రంథాలయ నిర్మాణం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులతో నూతన గ్రంథాలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాధవరం హనుమంత రావు ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థలో కంప్యూటర్ విభాగాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తన ఎంజెఆర్ ట్రస్ట్ ద్వారా కంప్యూటర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠకులకు కలుగుతున్న ఇబ్బందులను గుర్తించడం జరిగిందని, పాఠకుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న భవనం అన్ని హంగులతో పాఠకుల అవసరాలు తీర్చే విధంగా త్వరితగతిన పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. పాఠకులకు అన్ని వసతులు కల్పిస్తూ అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను పెద్ద మొత్తంలో స్టేట్ డైరెక్టర్‌తో మాట్లాడి తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పన, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, కవి, రచయిత వనపట్ల సుబ్బయ్య, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News