Friday, December 20, 2024

ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ కొత్త అంకాలజీ బ్లాక్ నిర్మాణం పూర్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : అరబింద్ ఫార్మా ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ ఎఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ క్యాంపస్‌లో రూ.80 కోట్లతో 300 బెడ్లతో కూడిన అంకాలజీ బ్లాక్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రొజుల్లో దీనిని ప్రారంభించనున్నారు. ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు సహకారం అందిస్తున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని అరబిందో ఫార్మా ఎండి, వైస్ చైర్మన్, ఎపిఎఫ్ డైరెక్టర్ కె.నిత్యానంద రెడ్డీ అన్నారు.

కొత్తగా నిర్మించిన ఈ అంకాలజీ బ్లాక్ రెండు ఎకరాల భూమిలో 2.32 లక్షల చదపు అడుగుల విస్తీర్ణం కల్గివుంటుంది. సెల్లార్, లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తులతో 300 బెడ్ల సామర్థం కల్గివుంటుంది. సిఎస్‌ఆర్(కార్పొరేట్ సమాజిక బాధ్యత) కార్యక్రమాల్లో భాగంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్(ఎపిఎఫ్) ఈ అంకాలజీ బ్లాక్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. దీని కోసం రూ.80 కోట్ల వెచ్చించింది. ఈ కొత్త అంకాలజీ బ్లాక్ ద్వారా తెలంగాణ, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పేద రోగులకు ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ స్పెషలైజ్డ్ క్యాన్సర్ సేవలను అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News