Thursday, January 23, 2025

వేగంగా పంచాయతీ భవనాల నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. శనివారం సచివాలయం నుంచి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిపిఓలు, డిఅర్‌డిఓలతో పిఆర్ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్‌లతో కలిసి మంత్రి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలన్నారు. హరితహారంలో లక్షానికి అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలి. దశాబ్ది సంపద వనాలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ల పనులలో వేగం పెంచడంతో పాటు నిర్ణీత లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సూచించారు.

అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి, కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను వేగిర పరచాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయితీలలో 6,544 గ్రామ పంచాయతీలకి భవనాలు ఉన్నాయన్నారు. మిగితా 6 వేల 225 గ్రామాలలో నిధులు మంజూరు చేసి నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా పిఆర్ శాఖకు 6.7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిగితా మొక్కలను కూడా త్వరగా నాటాలని వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.

కొత్తగా వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ ప్లాంటేషన్ ను 50 వేల చోట్ల చేయాలని మనం లక్ష్యం నిర్దేశించుకున్నాం అని వాటిని కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు, డిఆర్‌డిఓలు, డిపిఓలు, పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News