Thursday, November 21, 2024

పిహెచ్‌సీలు , సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆరోగ్యశాఖ , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అదే శిం చారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ , పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మా ట్లాడుతూ జిల్లాలో నూతనంగా 5 పీహెచ్‌సీలు,100 సబ్ హెల్త్ కేంద్రాలను నిర్మి ంచేందుకు అలాగే 21 పీహెచ్‌సిలు, 56 హెల్త్ సబ్ సెంటర్ల మర మ్మతులు పనులు ప్రారంభించడం జరిగిందని త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవల కోరకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

వారి నిర్మాణంపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందున నిర్మాణ పనుల్లో ఎలా ంటి ఆలసత్వం వహించకుండా త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, టిఎస్ ఎంఐడిసి డిఈ విశ్వప్రసాద్‌లను ఆదేశించారు. అదే విధంగా ప్రత్యేక శ్రద్ద చూపి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ , ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆజీముద్దిన్‌లకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News