Wednesday, January 22, 2025

దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
Construction of STPs should be completed by Dussehra
ఎస్టీపీల నిర్మాణాన్ని సందర్శించిన జలమండి ఎండీ దానకిషోర్

హైదరాబాద్: ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజ్3లో భాగంగా ఫతేనగర్, ప్రగతినగర్, దుర్గం చెరువుల్లో నిర్మిస్తున్న సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులను గురువారం జలమండలి ఎండీ దానకిషోర్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన అధికారులు, నిర్మాణ సంస్ద ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తియ్యేందుకు 24 గంటలపాటు పనులు, జరపాలని, ఇందుకోసం 03 షిప్టులో కార్మికులు పని చేసేలా చేసుకోవాలని సూచించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పనులు దశలవారీగా కాకుండా ఏకకాలంలో జరగాలని, ఇందుకు తగిన కార్మికులు, యంత్రాలు, సామాగ్రిని సిద్దం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎస్టీపీ ప్రాంగణంలో మూడు షిప్టులో సైట్ ఇంజనీర్లు ఖచ్చితంగా పనులను పర్యవేక్షించాలని నిర్మాణ సంస్ద ప్రతినిధులను ఆదేశించారు.

ఎస్టీపీ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ఆయన స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో పనులు జరుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సరిపడ వెలుతురు ఉండేలా ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్మాణ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కార్మికులు ఖచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలన్నారు. నిర్మాణ పనులతో ఎవరికి ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూషీట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీపీ ప్రాంగణంలో వివిధ దశల నిర్మాణ పనుల వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈకార్యక్రమంలో ఈడీ డా. ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్ద ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News