- Advertisement -
కడ్తాల్ : కడ్తాల మండలం రావిచెడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. మంగళవారం ఉప్పల ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు గ్రామస్థులతో కలిసి మరుగుదొడ్లను ప్రారంభించారు. ఇటీవల తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గ్రామంలో పర్యటించిన సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి హమీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వెంకటేష్, సింగల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, మల్లేష్‌యాదవ్, బోప్పిడి రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు.
- Advertisement -