Thursday, January 9, 2025

రాష్ట్రానికే వైశ్య సదన్ మోడల్‌గా నిర్మాణం

- Advertisement -
- Advertisement -
  • ఆత్మగౌరవ ప్రతీకగా సిద్దిపేట గౌడ ఫంక్షన్ హాల్
  •  పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట : రాష్ట్రానికే వైశ్య సదన్ మోడల్‌గా నిర్మించుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట శివారులో జీప్లస్1 విధానంలో నిర్మించిన వైశ్యసదనం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని గౌడ ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించారు. ఇప్పటికే కేటాయించిన నిధులు సరిపోక పోవడంతో అదనంగా నిధులు మంజూరు చేసినట్లు వైశ్య ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి వైశ్య సదన్ మోడల్‌గా నిర్మితమైందని వేలాది మంది సిట్టింగ్ కేపాసిటితో సిద్దిపేటలోనే అతిపెద్ద పంక్షన్ హాల్ గా ఉంటుందన్నారు. అలాగే ఆత్మ గౌరవ ప్రతీకగా సిద్దిపేట గౌడ ఫంక్షన్ హాల్ నిర్మితమైందన్నారు. సిఎం కెసిఆర్‌కు సిద్దిపేట వైశ్యులకు ఉన్న అనుబంధం విషయాలను గుర్తు చేశారు. వైశ్య సదనం ప్రధాన పనులు పూర్తికాగా పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

పార్కింగ్ వసతికి అనుకూలంగా ఉండేలా అడ్డుగా ఉన్నస్టోన్ పనులు పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టరును అదేశించారు. అనంతరం తుది మెరుగులు దిద్దుతూ ప్రారంభానికి ముస్తాబవుతున్న గౌడ ఫంక్షన్ హాల్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, వైశ్య సంఘం ప్రతినిధులు కొమురవెల్లి అంజయ్య, తోట ఆశోక్ ,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News