Wednesday, January 22, 2025

నాగోల్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని : డిఎస్ చౌహాన్

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : నాగోల్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ అన్నారు. నాగోల్ డివిజన్ మమతానగర్ నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్‌స్టేషన్ భవనాన్ని నాగోల్ పిఎస్ భవనాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. ఆర్కేపురం డివిజన్ మహాత్మాగాంధీ కాలేజీ గ్రూపు 4 పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుకుండా చూసుకోవాలని పోలీసులకు సూ చించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డిసిపి సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎస్‌హెచ్‌ఓ అంజిరెడ్డి , నాగోల్ ఎస్‌హెచ్‌ఒ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News