Saturday, December 21, 2024

రెండు కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో మంగళవారం ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న 33/ 11 కేవి సబ్ స్టేషన్‌ను నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు స్వరాష్ట్రం ఏర్పడ్డ తరువాత 24 గంటల విద్యుత్ సరాఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. వ్యవసాయానికి రైతుల కొరకు ఎంతో పాటుపడుతుందన్నారు.

విద్యుత్ అధిక డిమాండ్ వల్ల లోడు ఎక్కువ పడవద్దని ఉద్దేశంతో రామేశ్వర్ పల్లికి సబ్ స్టేషన్ మంజూరుకు సిఎం వద్దకు వెళ్లగానే ఇకే రో జులో కాపి అందజేశారని చెప్పారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు, విద్యుత్ శా ఖ సిఎండి గోపాలరావుకు గ్రామస్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రా మంలో అంగన్వాడీ భవనానికి వారం రోజుల్లో నిధులు కేటాయిస్తానని హామీ ఇ చ్చారు. గ్రామంలో మిగిలి ఉన్న కమ్యూనిటీ హాల్ కు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ యంకే.ముజీబుద్దీన్, సర్పంచ్ పోతిరెడ్డి, ఎంపిపి గాల్‌రెడ్డి, జడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జడ్పిటిసీ పద్మా నాగభూషణం గౌడ్, సొసైటీ చైర్మన్ భూమ్‌రెడ్డి, వైస్ ఎంపిపి గుడిసె యాదగిరి, ఏఎంసీ వైస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, రైతు బందు జిల్లా డైరెక్టర్ బోయిని మాధవి బలరాం, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, రైతు బంధు గ్రామ అద్యక్షులు బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News