Sunday, December 22, 2024

కంటి డాక్టర్‌ను సంప్రదించండి: బిజెపి నాయకులకు చిదంబరం సలహా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మేనిఫెస్టోపై బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలను మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం సోమవారం తిప్పికొట్టారు. సంపద సృష్టి అనే పదాన్ని సంపద పంపిణీగా బిజెపి నాయకులు చదివితే వారు మళ్లీ మాధ్యమిక పాఠశాలకు వెళ్లడమో లేక కంటి డాక్టర్‌ను సంప్రదించడమో చేస్తే మంచిదని చిదంబరం చురకలు అంటించారు.

తమ పార్టీ ఆర్థికాభివృద్ధికి, సంపద సృష్టికి కట్టుబడి ఉందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్‌గా ఉన్న చిదంబరం తెలిపారు. యుపిఎ ప్రభుత్వం కొనసాగి ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి మళ్లీ రెట్టింపు అయ్యేదని, 202324లో రూ. 200 లక్షల కోట్లకు చేరుకునేదని చిదంబరం తెలిపారు. రానున్న పదేళ్లలో జిడిపిని రెట్టింపు చేయాలని కాంగ్రెస్ లక్షం పెట్టుకుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News