డెహ్రాడూన్: మంత్రాలు చేస్తున్నారనే నేపంతో నలుగురికి బలవంతంగా మలం తినిపించి అనంతరం వేడి ఇనుప రాడ్ తో వాతలు పెట్టిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అశ్వారి గ్రామంలో నలుగురు వ్యక్తులు మంత్రాలు చేస్తున్నారనే నేపంతో వారిపై గ్రామస్థులు దాడి చేశారు. అనంతరం మలాన్ని బాటిల్ పోసి నలుగురు చేతి తినిపించారు. వేడిగా ఉన్న ఇనుప రాడ్ తో వాతలు పెట్టడంతో తీవ్రంగా దాడి చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు సరియహత్ పోలీస్ స్టేషన్ అధికారి వినయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని వినయ్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్ సిఆర్బీ నివేదిక ప్రకారం 2001 నుంచి 2020 మధ్య మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో 590 మందిని హత్య చేశారు. బాధితులలో ఎక్కువగా మహిళలే ఉన్నారు.
మంత్రాలు చేస్తున్నారని మలం తినిపించారు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -