Friday, November 15, 2024

డీమార్ట్, ప్యారడైజ్ రెస్టారెంట్లకు వినియోగదారుల పోరమ్ జరిమానా

- Advertisement -
- Advertisement -

Consumer forum fine for D-mart, Paradise restaurants

 

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని డీమార్ట్ షాపింగ్ మాల్, ప్యారడైజ్ రెస్టారెంట్లలో వినియోగ దారుల నుంచి క్యారీ బ్యాగుల కోసం ఆదనంగా చార్జీలు వసూలు చేస్తున్నందుకు శుక్రవారం నాడు వినియోగదారుల పోరమ్ జరిమానా విధించింది. హైదర్‌గూడ డీమార్ట్ బ్రాంచ్‌కు, సికింద్రాబాద్, బేగంపేట ప్యారడైజ్ రెస్టారెంట్లకు వినియోగదారుల ఫోరమ్ కోర్టు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఫిర్యాదు చేసిన వ్యక్తికి రూ. 4 వేల నష్ట పరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్ తీర్పు చెప్పింది. కాగా, విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి ఆహారాన్ని కొనుగోలు చేయగా క్యారీ బ్యాగ్స్ కోసం రూ.4.76 చార్జ్ చేశారు. 2019 జూన్‌లో హైదరాగూడ డీమార్ట్ నుంచి సామాగ్రి కోనుగొలు చేయగా అక్కడ కూడా క్యారీ బ్యాగ్ కోసం రూ. 3.75 వసూలు చేశారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించడంతో కమిషన్ తీర్పునిచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News