Sunday, January 19, 2025

ఆటోలకు వంటగ్యాస్ వినియోగం

- Advertisement -
- Advertisement -

Consumption of cooking gas for autos

నందనవనంలో దుర్వినియోగమవుతున్న వంట గ్యాస్

హస్తినాపురం: ఎల్‌బినగర్ నియోజక వర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనం బస్తీలో వంటగ్యాస్ అక్రమ వ్యాపారం దర్జాగా కొన సాగుతోంది. ఇంటి వంటకాలకు వాడాల్సిన డొమెస్టిక్ వం ట గ్యాస్ బుడ్డీలను కొందరు వ్యక్తులు ఆటోలల్లో నింపుతూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. సంవత్సరాల నుంచి ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నా ఎవరూ పట్టించు కోవడం లేదని గ్రహించిన అక్రమ ణదారులు నిర్భయంగా అక్రమంగా వ్యాపారం కొనసా గిస్తున్నారు. వేల సంఖ్యలో నివాసం ఉంటున్న గిరిజన ప్రజలు గల నందనవనం బస్తీ ప్రజలు ఇంటికో ఆటోను సంపాదించుకొని సగం ధరకే గ్యాస్ నింపుకొని అక్రమ సంపాదన తతంగం కొన సాగిస్తున్నారు. హెచ్.పి, ఇండియన్ కంపనీల డొమెస్టిక్ సిలిండర్లను ఇంటింటికీ సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ల సరఫరాదారులు, ఈ అక్రమ వ్యాపారులు ఏకమై ఏకంగా ఇంటికో మినీ గ్యాస్ బంకునే ఏర్పాటు చేసుకున్నారంటే నమ్మశక్యం కాదు. మహిళలు సైతం నివాసాల ముందు వంట గ్యాస్‌ను ఆటోలల్లో నింపుతున్నారు. సిలిండరు బుడ్డిని బొర్లించి ఓ పంపింగ్ యంత్రంతో నేరుగా ఆటోల్లో నింపుతూ అతి సులభంగా రోజుకు వేలాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తూ సులభతరమైన సంపాదన కొన సాగిస్తున్నారు. ఓ చిన్న గాలి పంపు లాంటి మిషన్ పైపును ఆటోకు గ్యాస్ బుడ్డికి లింకు చేసి గ్యాస్‌ను గాలి పంపు యంత్రం సహాయంతో బంకు మాదిరి ఆటోల్లో నిం పుతున్నారు.

ఆటో వాళ్లు ఎందుకు ఇలా నింపుకుంటున్నారంటే…
ప్రభుత్వం నిర్వహిస్తున్న బంకులో రూ. 1400లు వెచ్చించి ట్యాంకు ఫుల్ చేసుకుంటే కేవలం 300 కిలోమీటర్ల మైలేజి మాత్రమే వస్తుంది. అదే వంట గ్యాస్‌ను రూ.1000 మాత్రమే చెల్లించి ట్యాంకు ఫుల్ (18 లీటర్లు) నింపుకుంటే దాదాపు 500 కిలో మీటర్ల మైలేజి వస్తుంది. అందుకే దొంగ చాటుగా వంట గ్యాస్‌ను చాలా కాలం నుంచి నింపుకుంటున్నామని పలువురు ఆటో డ్రై వ ర్లు చెప్పకనే చెప్పుతున్నారు. అక్రమ వ్యాపారం చేస్తున్న వారు సిలిండర్లు సరఫరా చేసే వారి నుండి రూ. 1300 వందలకు ఒక్క గ్యాస్ సిలిండరును కొనుగోలు చే స్తున్నారు. 14.50 కేజీల గ్యాస్‌ను 24 లీటర్లుగా కొన మా నంగా మార్చి ఆటోల్లో నింపుతూ రెట్టింపు స్థాయిలో సంపాదిస్తున్నారు. సరఫరాదారులు ఈ అక్రమ వ్యా పారులకు ఒక్క సిలిండరును రూ.1200లకు సరఫరా చేస్తూ ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా లాభపడుతున్నారు. వినియోగదారులు గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తే వారికి సకాలంలో ఇవ్వకుండా డోర్‌లాక్ లేదా మరేదో కారణం చూపుతూ తప్పుడు నమోదు చేసుకొని ఆయా సిలిండర్లను ఈ అక్రమ వ్యాపారులకు ఇస్తున్నట్లు విశ్వనీయ సమా చారం. ఈ విషయాన్ని ‘మన తెలంగాణ’ బుధవారం రాజేంద్రనగర్ ఫౌర సరఫరాల అధికారి దృష్టికి తీసుకోగా వెంటనే స్పందిస్తామని తెలిపారు. వంట గ్యాస్‌ను ఆటో లకు వాడటం చట్ట విరుద్ధమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News