Monday, December 23, 2024

పొగాకు వినియోగిస్తే జీవితానికి అనర్ధాలు : ఎమ్మెల్యే దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పొగాకు వినియోగిస్తే ఎన్నో అనర్థాలున్నాయని ప్రతి ఒక్కరూ పొగతాగడం మాని వేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రపంచ టొబాకో దినోత్సవం సందర్భంగా విరించి హాస్పిటల్స్, బంజారాహిల్స్ ఆధ్వర్యంలో కె బీ ఆర్ పార్క్ నుండి బంజారా హిల్స్ రోడ్ నెం 1 వద్ద వరకు విరించి సర్కిల్ వరకూ వాకథాన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పొగాకు వినియోగం కేవలం సిగరేట్లు, బీడీల రూపంలోనే కాకుండా ఇపుడు ఖైనీ, గుట్కా లాంటి ఎన్నో పేర్లతో వాడుతున్నారని అవి ఇంకా ప్రమాదకరమైనవి ఆయన హెచ్చరించారు. వీటన్నింటికి దూరంగా ఉంటూ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తూ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని సూచించారు. ఈ వాకథాన్ డా. సాయి రవి శంకర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వి సత్యన్నారాయణ, విరంచి హాస్పిటల్ డా శ్రీ దేవి గుత్తా,  డా. రవి తేజ, కన్సల్టెంట్ పల్మనాలజిస్టు, విరంచి హాస్పిటల్ లతో పాటు పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News