Wednesday, January 22, 2025

మూసాపేటలో కంటెయినర్ బీభత్సం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని ముసాపేటలో కంటెయినర్ బీభత్సం సృష్టించింది. ముసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం డివైడర్ పైకి కంటెయినర్ దూసుకెళ్లింది.  ముసాపేట వైపు నుంచి కూకట్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కంటెయినర్ వదిలి పారిపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కంటెయినర్ ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News