Monday, December 23, 2024

ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్… చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ ను లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపారు. పార్శిల్ సర్వీస్ కంటైనర్ ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తుండగా ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది

. కంటైనర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో రెండు వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చలికాలంలో తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ముందున్న వాహనాలు డ్రైవర్లకు కనిపించడం లేదు. దగ్గరకు వచ్చే వరకు వాహనాలు కనిపించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News