Wednesday, January 22, 2025

లారీని ఢీ కొని కంటైనర్ డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్‌ః మండలంలోని మన్నూర్ గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ కంటైనర్ అదుపు తప్పి లారీని ఢీ కొన్న సంఘటనలో సరాఫ్ భాస్కర్ (58) అనే కంటైనర్ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం … బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు ఎలక్ట్రానిక్ సరుకులతో కంటైనర్‌కు మన్నూర్ గ్రామ సమీపంలో పశువుల అడ్డు రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కంటైనర్ అతివేగంగా అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు ఉన్న లారీని ఢీ కొన్న సంఘటనలో కంటైనర్ డ్రైవర్ సరాఫ్ భాస్కర్ గాయపడ్డాడని తెలిపారు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందిన ట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడు నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందిన వాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News