Sunday, December 22, 2024

లారీ ఢీకొని కంటెయినర్‌లో చెలరేగిన మంటలు.. డ్రైవర్‌ సజీవదహనం

- Advertisement -
- Advertisement -

లారీ ఢీకొని కంటెయినర్‌లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. ఈ విషాద సంఘటన తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు మండలం చవటకండ్రిగ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప్టటారు. మంటలను అదుపుచేసి, క్షతగాత్రుడిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కంటెయినర్‌.. మైసూర్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News