Wednesday, December 25, 2024

త్రుటిలో తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ ః గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారిలో ఓ కంటైనర్ లారీ అదుపుతప్పి ఇంటి పైకి దూసుకొచ్చి సర్వీస్ రోడ్డుపై బోల్తా పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇచ్చోడ వైపు నుండి ఆదిలాబాద్ వైపు వెళుతున్న ఓ కంటైనర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి సర్వీసు రోడ్డు పైకి దూసుకొచ్చి పక్కనే ఉన్న ఓ ఇంటి గోడను ఢీకొని పడిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్సు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News